బడికి వస్తావా? బాలా! బరులు దిద్దావా?

బడి, పాల - పాదాలతో అనేక వైవిధ్య అర్ధాలతో మాటలు ఇవి:-
"బడికి వస్తావా? 
బాలా! బరులు దిద్దావా?
ఓమ్ నమశ్శివాయః!
సిద్ధం నమః, అంటూ ||
బడికి రావాలి,
బాలలు బరులు దిద్దాలి ......."
నా చిన్నప్పుడు రేడియోలో ఇష్టంగా ఈ పాటను వినేదాన్ని.
న్యాయపతి కామేశ్వరరావు, న్యాయపతి కామేశ్వరి - 
రేడియో అన్నయ్య, అక్కయ్యలు.
రేడోయో "బాల వినోదం" కార్యక్రమంలో ఎన్నెన్నో బాల గీతాలు,
ఈ పై పాట ఒకటి ఆ ఆణిముత్యాలలోనిది. 

{బడి = అక్షరములు, ఒత్తులు, దీర్ఘాలు, గుణింతాలు}  

*******************

పాల పళ్ళు; పాల సముద్రం, కొబ్బరిపాల; 
పాలమ్మి, పాలవాడు, పాలగిన్నె, పాలబువ్వ  
పాలపిట్ట, పాలకంకి, పాలన, పరిపాలన,
ఉయ్యాల-జంపాల, గోపాల!, చెట్టు / ఆకు పాల (రబ్బరుచెట్టు మున్నగునవి) 
పాల కొండలు; పాల కొల్లు, పాల్వచ. పాలధారలు;    
పాల వెన్నెల; 
"పాలు ఒలికితే తీసుకోవచ్చు - అన్నంత శుభ్రంగా నేలను కడిగారు." 
పాలకులు, పాలక వర్గం;  

******************* 


బడి = పాఠశాల, స్కూలు:- బడి ; మా బడి ; 
పలుకుబడి ; రాబడి ; దిగుబడి ; వెంబడి ; 
సాంబడి పెత్తనం; వరుంబడి ; కంబడి;
బడితెపూజ (= బెత్తం, దండన)
పేరు బడిన మనిషి (= మంచి కీర్తి, మంచి పేరు కలిగినవాడు)
కబడీ కబడీ ; కబడీ ఆట; 
ఇప్పుడే దిగబడ్డ విలన్ ; చేరగిలబడి ; 

*******************

రాబడి, బడి, నది, దసరా;;; 
చార, మైనా : మతి, దిగు;;; రావి, గంగ, చెట్టు ;;;
ఈ మాటలు వచ్చేటట్లుగా - 'కొత్త పద బంధములు'
సృష్టిస్తారా!?  

1] చార, మైనా ~ ప్రచారమైనా;  
2] దిగు, మతి ~ దిగుమతి; 
3] రావి, గంగ, చెట్టు ~ గంగరావి చెట్టు;
4] రాబడి, బడి, నది, దసరా ~ దసరా బడినది 
5] క్షణములు ~ వీక్షణములు 

*******************

"baDiki wastaawaa? baalaa! barulu diddAwA? 
Om  namaSSiAya! siddham nam@h, amTU || 
baDiki raawaali, baalalu barulu diddaali ......." naa chinnappuDu 
rEDiyOlO ishTamgaa ii paaTanu winEdaanni.
nyaayapati kaamESwararaawu, nyaayapati kaamESwari - 
rEDiyO annayya, akkayyalu.
rEDOyO "baala winOdam" kaaryakramamlO 
ennennO bAla giitAlu,
I pai paaTa okaTi A ANimutyaalalOnidi. 
{baDi = aksharamulu, ottulu, diirghaalu, guNimtaalu}
baDi = paaThaSAla, skuulu:- baDi ; maa baDi ; palukubaDi ;
 raabaDi ; digubaDi ; wembaDi ; saambaDi pettanam; warumbaDi ; 
kabaDii kabaDii ; kabaDii ATa; chEragilabaDi ;


*******************

 paala paLLu ; paala samudram, kobbaripaala; 
paalapiTTa, paalakamki, paalana, paripaalana,
uyyaala-jampaala, gOpaala!, 
cheTTu / aaku paala (rabbarucheTTu munnagunawi) 
paala komDalu; paala kollu, 
paalwacha. paaladhaaralu;    
paala wennela; 
"paalu olikitE tiisukOwachchu - annamta 
Subhramgaa nElanu kaDigaaru." 
paalakulu, paalak wargam;  

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు