పోస్ట్‌లు

జులై, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

శ ష స - లు ఒకే పదంలో

య ర ల శ ష స హ - వీనిలోని -  శ ష స  - లకు ఉచ్ఛారణా భేదం ఉన్నదని, కనిపెట్టి,  ఆ మూడిటి ధ్వని స్థానములను  కనిపెట్టిన ఘనత మన భారతీయులది.  అతి ప్రాచీన కాలమున "పాణిని" మున్నగు మహానుభావులు అచ్చులకు, హల్లులకు,  సున్న, అరసున్న, విసర్గలకు, అనునాసికములకు కల ప్రత్యేకతలను భారతీయులకు అందించినారు. ఇట్టి ఘనతను సాధించిన వ్యాకరణకర్తలు  మన ప్రాచీన భారతీయులు అవడం  మనకు గర్వ కారణం. కంఠ్యములు - హ [ అ, ఆ];  తాలవ్యాలు - య, శ [ ఇ, ఈ ] ;  మూర్ధన్యాలు - ష, ఱ, ర  [ ఋ ౠ ];  దంత్యాలు :- ర, ల, స ;  దంత్యోష్ఠములు :- వ ; శ ష స - లు ఒకే పదంలో పక్క పక్కనే  ఏ రెండు ఐనా వస్తే వాటిని ఉచ్ఛరించడం క్లిష్టమే కదా!  వీనిని స్పష్టంగా పలుక గలవారు  "మన తెలుగు వారే నని!" కితాబు కూడా లభించింది మరి!  [గత దశాబ్దం దాకా - అన్న మాట.]  ఇప్పుడు అట్లాంటి కొన్ని పదాలను గమనిద్దామా!?  ;  శ్రీ సాయిదేవ మహరాజ్ ;    శ్రీ సత్యసాయి : శ్రీశైలం ; ; శ్రావస్తి ;  శేషశైలవాస! ; శేషప్రశ్న ;  శ్రీశాతవాహన : శ్యామసుందరుడు ;  శేషగిరి రావు ; శేషాద్రి ; శేషమాంబ ; శేషమ్మ ; శేషు ;  శుభాకాం