పోస్ట్‌లు

ఆగస్టు, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

తిలకించండీ కనులారా! పులకించండీ మనసారా!

ప్రపంచ శాంతికి ప్రభా గీతిక;  ప్రతిబింబముగా నిలిచినదీ                  అదె మన జెండా!      ||తిలకించండీ కనులారా!             పులకించండీ మనసారా! || నీలిగగనముకు బంగరు వన్నెల ;  అందములెన్నో అందించేను; మన జెండా:  అదె చూడండి త్రివర్ణ పతాక      ||తిలకించండీ కనులారా!             పులకించండీ మనసారా! || ప్రపంచ శాంతికి ప్రభా గీతిక;  ప్రతిబింబముగా; నిలిచినదీ                          అదె మన జెండా!  నిఖిల జగతికి నిరతాకర్షణ         నిరుపమానము మన జెండా      ||తిలకించండీ కనులారా!             పులకించండీ మనసారా! ||          [రచన:- కుసుమాంబ1955]   ''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''' 

నేస్తమా! friendship day

చిన్ననాటి " ఆట "పాటలందు మోదముల;  " వెల " కట్టగలరా, ఎవ్వరైనా ; " ది "వి - లోన ;      మధుర ప్రభలజ్యోతి, వెలుగు స్నేహమేరా!   ఆటవెలది, కంద, తేటగీతి, ద్విపద ఛందమ్ములందైన -  చంపూ చతుర శైలి విన్నాణములందైన ;  ఎట్టి ఛందమును లేని చేవ్రాతలందైన; స్ఫటిక స్వచ్ఛమౌ సరళమౌ మైత్రి యొక్క 'చందము'   తరళ నిరతశోభలు చూడ   స్నేహదీప్తి జాడ , లోకమ్మునందు!                ఛందస్సు చందము :- చందము = పద్ధతి, రీతి :   ఛందస్సు = పద్య లయ, ఛందస్సు]  ********************************, Sun, Aug 2, 2015, Friendship Day పర్యాయపదములు:-    అ] స్నేహము, మైత్రి, నేస్తము, నేస్తం ; ఫ్రెండ్  ఆ] స్నేహశీలి, మిత్రుడు , స్నేహితుడు, నేస్తుడు, ఫ్రెండ్ షిప్ ;      స్నేహ బంధము, మైత్రీ చిహ్నము, మైత్రీ వనము;   ఇ] బాల్య స్నేహము ; బాల్యమిత్రులు; చిన్ననాటి స్నేహితులు;      ప్రాణస్నేహము ; ప్రాణస్నేహితుడు; ప్రాణమిత్రుడు; ఈ]  మిత్రవింద (name), స్నేహ,   "మిత్రమా!",        "స్నేహితుడా!" ;  "నేస్తమా!"; "వయస్యా!"  *******