భాంగ్రా నృత్య - భక్త శబరి
నాగదా డాన్స్ ; గుజరాత్ లో భాంగ్రా నృత్య రీతి - క్రమంగా దేశ వ్యాప్తి గాంచింది, ప్రపంచానికి సుపరిచితమైన భాంగ్రా నాట్య రీతిలో - "రామ్ లీలా" అనే హిందీ సినిమాలో ఈ పాట, నాట్యాలు - ప్రేక్షకులకు మానసోల్లాసాన్ని కలిగిస్తూ, ఆకర్షణీయతతో హిట్ ఐనది. రామాయణంలో ప్రాంతాల వారీగా అనేక ఉపకథలు కల్పనలతో సృజించబడినవి. జానపదుల నుండి - నాటక, నాట్య రంగాలలో ఆయా గాధలు విస్తరించినవి. వాటిలో ఒకటి ;- భక్త శబరి - కథ. శ్రీరాముడు అరణ్యవాసానికి సీతా, లక్ష్మణ సమేతుడై వెళ్ళాడు. రావణుడు సీతాదేవిని అపహరించాడు. రామచంద్రుడు భార్యా వియోగం వలన దురపిల్లుతూ అన్వేషణ చేస్త్న్నాడు. ఆ క్రమంలో సోదరులు ఇద్దరు శబరి ఆశ్రమానికి వచ్చారు. ఆమె వారికి ఆతిథ్యాన్ని ఇచ్చింది. భక్త శబరి - తీపి పళ్ళను ఇవ్వాలని, ప్రతి పండునూ కొరికి చూస్తి, వారికి ఇచ్చింది. రామయ తండ్రి - సంతోషంతో ఆమె స మర్పిం చిన ఎంగిలి పళ్ళను తిన్నాడు. ఇందులో - మాయ మర్మం తెలియని భక్తి భావం, తత్ భావ స్వీకరణ, సమాదరణ - ప్రజల మన్ననలను పొందింది. శ్రీరామ వనవాసము లో కొన్ని ఇట్లాంటి సంఘటనలు, ప్రక్షిప్త...