నేస్తమా! friendship day

చిన్ననాటి "ఆట"పాటలందు మోదముల; 
"వెల" కట్టగలరా, ఎవ్వరైనా ; "ది"వి - లోన ;     
మధుర ప్రభలజ్యోతి, వెలుగు స్నేహమేరా!  

ఆటవెలది, కంద, తేటగీతి, ద్విపద ఛందమ్ములందైన - 
చంపూ చతుర శైలి విన్నాణములందైన ; 
ఎట్టి ఛందమును లేని చేవ్రాతలందైన;
స్ఫటిక స్వచ్ఛమౌ సరళమౌ మైత్రి యొక్క 'చందము'  
తరళ నిరతశోభలు చూడ  
స్నేహదీప్తి జాడ , లోకమ్మునందు! 

             ఛందస్సు చందము :-
చందము = పద్ధతి, రీతి :  
ఛందస్సు = పద్య లయ, ఛందస్సు] 

********************************,

Sun, Aug 2, 2015, Friendship Day

పర్యాయపదములు:- 
 
అ] స్నేహము, మైత్రి, నేస్తము, నేస్తం ; ఫ్రెండ్ 
ఆ] స్నేహశీలి, మిత్రుడు , స్నేహితుడు, నేస్తుడు, ఫ్రెండ్ షిప్ ;
     స్నేహ బంధము, మైత్రీ చిహ్నము, మైత్రీ వనము;  
ఇ] బాల్య స్నేహము ; బాల్యమిత్రులు; చిన్ననాటి స్నేహితులు;
     ప్రాణస్నేహము ; ప్రాణస్నేహితుడు; ప్రాణమిత్రుడు;
ఈ]  మిత్రవింద (name), స్నేహ,   "మిత్రమా!", 
      "స్నేహితుడా!" ; "నేస్తమా!"; "వయస్యా!" 
********************************,

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు