ఇరావతీనది, మింజర్ festival

నదులను, నదీ జలమార్గాలను తమ మేధాశక్తితో ప్రయోజనకరముగా మలిచిన మహాఋషులు కలరు.సర్వజనహితము వారి ధ్యేయము. సమాజహితాభిలాష ఫలితముగా 
భారతావనిలో గొప్ప నదుల ప్రవాహాలు, జలాశయాలు పురాతనకాలము నాటినుండీ ఏర్పడినవి.
భగీరధుడు, కశ్యపుడు మున్నగు అనేకమంది ఋషిసత్తములు అలనాటి గొప్ప ఇంజనీర్లు. 
**********************,  

రాజా సాహిల్ వర్మన్(राजा  साहिल वर्मा ) ఇరావతీనది ఉన్న చంబా దేశ పాలకుడు.
ఆయన పుత్రిక చంపావతి పేరుతో చంబా దేశము ఏర్పడినది. 
హిమాచల్ ప్రదేశ్ లో ఇరావతీనదిని దేశమునందు
పంటలు పుష్కలముగా పండుతూ, సిరిసంపదలు వర్ధిల్లుటకు కారణమై, 
జనుల పూజలను అందుకుంటూన్నది.  
రాజా సాహిల్ వర్మను ఆయన కుమార్తె చంపావతి 
"తండ్రీ! ఈ ఇరావతీనదీతీరము  రమణీయత కన్నులపండుగగా ఉన్నది.
ఇక్కడ ఒక భవనమును ఏదైనా కట్టించండి!" అడిగింది. 
కుమార్తె పలుకులను జ్ఞాపకము ఉంచుకుని వర్మ మంత్రులతో సమాలోచనలు జరిపాడు. 
వారు "కోవెలను నిర్మిస్తే ప్రజలందరికి ఉపయోగము ఔతుంది ప్రభూ!" అని చెప్పారు.
చంపావతీ కోవెల నిర్మాణాన కృషికి ఆవిష్కారణ జరిగినది. 
రాజా సాహిల్ వర్మ దీక్షతో ఏర్పడిన కట్టడము వెలసినది. 
రాజు "శిఖర శైలి"తో ఆలయాన్ని నిర్మించాడు.  
ఇరావతీనది ఒడ్డుపై కట్టించిన రిజర్వార్, జలాశయం, చంపావతిగుడి 
ప్రజలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రములు ఐనవి.. 
(ఇరావతీ నది నామము కాలక్రమేణా “రావినది” అని రూపాంతరము చెందినది.)
రాజా సాహిల్ వర్మ తన కుమార్తె జ్ఞాపక కట్టడము. 
************************,
10 వ శతాబ్దం గోరఖ్ నాధ్ అనుయాయి, విద్యార్ధి ఐన ఒక ఋషి 
చార్పత్ నాధ్  రాజా సాహిల్ వర్మకు
 
రాజగురువు.
చంపావతి గుడి, హరిరాయ గుడి – రావి నదికి రెండు తీరాలలో ఉన్నాయి. 
ప్రతి రోజూ గురువు హరిరాయ్ గుడికి, అవతలి ఒడ్డు నుండి ఈదుకుంటూ వచ్చి, పూజిస్తూ ఉండేవాడు.  
చంపావతి గుడి ఉన్న తీరాన ఆ ఋషి నివసిస్తున్నాడు.
ఇది గమనించిన రాజా సాహిల్ వర్మన్ 
“మహర్షీ! ఇరావతీనదిని వేరొక దిశకు మళ్ళించిన ఎడల ప్రజలకు, 
భక్తులకు అనుకూలంగా ఉంటుంది కదా!”అని అడిగాడు. 
రాజు అభిలాష మేరకు ఋషి / తన తపస్సును ధారపోసాడు
తన దివ్యశక్తితో నదీ మార్గాన్ని మళ్ళించగలిగాడు.
 రెండు గుడులు - నదీ ప్రయాణం అవసరం లేకుండా భూమార్గమున చేరే వీలు కలిగింది.
చార్పత్ నాధ్ రాజగురువు. గురువు పేరుతో చంపాపట్టణాన్ని నిర్మించాడు  సాహిల్ వర్మ. 
రాజా సాహిల్ వర్మ రాజ్యం అంతటా వేడుకలు చేయమని ప్రజలకు అనుమతి ఇచ్చాడు. 
ఆనాటి నుంచీ “మింజర్ వేడుకలు” జరుగుతున్నాయి.
మింజర్ వేడుకలు:- ప్రజల అలంకరణలు బహు సుందరముగా ఉంటాయి.
ఏడురంగుల త్రాడును జనులు తయారుచేస్తారు. 
ఏడురోజులూ, రోజూ వేర్వేరు రంగులతో తయారుచేస్తారు.
వస్త్రాలు, త్రాళ్ళు,  మోకులను సిల్కు, బంగారు పట్టు దారాలతో చేస్తారు.  
ఈ పసిడి వనె పట్టు – హిమాచల్ ప్రదేశ్ లో లభించడము ప్రత్యేకమైనది. 
వారి నాట్యాలు, ఆటపాటలతో వాతావరణము రంగులమయం ఔతుంది. 
అందుచేతనే ఈ పండగలు జరిగే వేళలలో వివిధ ప్రాంతాలనుండి లక్షలమంది  ప్రజలు వస్తారు. 
అనేకమంది సందర్శకులను, టూరిస్టులను రప్పిస్తూ ఈ ప్రాచీనపండగ, 
నేటికీ శోభస్కరమౌతూ ఉన్నది.

*********************************;

గంగరావి చెట్టు
పేజీ వీక్షణ చార్ట్ 621 పేజీవీక్షణలు - 55 పోస్ట్‌లు, చివరగా Jun 23, 2015న ప్రచురించబడింది 
 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు