కోలాహలముల ముగ్గులు
వయ్యారమొలికించు పల్లవాంగుళులు
అవనికి సంక్రాంతి పర్వశోభల్లు ॥
కోలు కోలో అనుచు; ధరణిని
కోలములు - వేసేరు పణతులు;
ముక్కోటి దేవతలు మేదినికి
దిగివచ్చు కోలాహలములు;
- భలే కోలాహలమ్ములు ||
పుష్యమీ తారక తళుకులన్నీ ఇచట;
ముగ్గులలొ చుక్కలై ముంగిళ్ళ ఒలికేను
సరిగంచు ఓణీల, పావడా తళతళలు
చుట్టు గీతావళుల మెరుపులై వెలసేను ||
పౌష్యమాసము భువికి; పుష్కలమ్ముగ ఇచ్చు;
సిరి పైరు కలిమి; సంక్రాంతి చెలిమి
మార్గశీర్షము పుడమి; మంచి మార్గము చేయు;
మంచుపందిరులందు హేమంతినీ ప్రభలు ||
{కోలాహలముల కోమలీ ముగ్గులు}
అవనికి సంక్రాంతి పర్వశోభల్లు ॥
కోలు కోలో అనుచు; ధరణిని
కోలములు - వేసేరు పణతులు;
ముక్కోటి దేవతలు మేదినికి
దిగివచ్చు కోలాహలములు;
- భలే కోలాహలమ్ములు ||
పుష్యమీ తారక తళుకులన్నీ ఇచట;
ముగ్గులలొ చుక్కలై ముంగిళ్ళ ఒలికేను
సరిగంచు ఓణీల, పావడా తళతళలు
చుట్టు గీతావళుల మెరుపులై వెలసేను ||
పౌష్యమాసము భువికి; పుష్కలమ్ముగ ఇచ్చు;
సిరి పైరు కలిమి; సంక్రాంతి చెలిమి
మార్గశీర్షము పుడమి; మంచి మార్గము చేయు;
మంచుపందిరులందు హేమంతినీ ప్రభలు ||
{కోలాహలముల కోమలీ ముగ్గులు}
![]() |
సంక్రాంతి కోమలి |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి