బడికి వస్తావా? బాలా! బరులు దిద్దావా?
బడి , పాల - పాదాలతో అనేక వైవిధ్య అర్ధాలతో మాటలు ఇవి :- "బడికి వస్తావా? బాలా! బరులు దిద్దావా? ఓమ్ నమశ్శివాయః! సిద్ధం నమః, అంటూ || బడికి రావాలి, బాలలు బరులు దిద్దాలి ......." నా చిన్నప్పుడు రేడియోలో ఇష్టంగా ఈ పాటను వినేదాన్ని. న్యాయపతి కామేశ్వరరావు, న్యాయపతి కామేశ్వరి - రేడియో అన్నయ్య, అక్కయ్యలు. రేడోయో "బాల వినోదం" కార్యక్రమంలో ఎన్నెన్నో బాల గీతాలు, ఈ పై పాట ఒకటి ఆ ఆణిముత్యాలలోనిది. {బడి = అక్షరములు, ఒత్తులు, దీర్ఘాలు, గుణింతాలు} ******************* పాల పళ్ళు; పాల సముద్రం, కొబ్బరిపాల; పాలమ్మి, పాలవాడు, పాలగిన్నె, పాలబువ్వ పాలపిట్ట, పాలకంకి, పాలన, పరిపాలన, ఉయ్యాల-జంపాల, గోపాల!, చెట్టు / ఆకు పాల (రబ్బరుచెట్టు మున్నగునవి) పాల కొండలు; పాల కొల్లు, పాల్వచ. పాలధారలు; పాల వెన్నెల; "పాలు ఒలికితే తీసుకోవచ్చు - అన్నంత శుభ్రంగా నేలను కడిగారు." పాలకులు, పాలక వర్గం; ******************* బడి = పాఠశాల, స్కూలు:- బడి ; మా బడి ; పలుకుబడి ; ...