హంసల దీవి
పిల్లలూ!చారిత్రక ,భౌగోళిక ప్రాధాన్యము కలిగిన అనేక ప్రదేశములు మన దేశములో ఉన్నాయి . ఆయా ప్రాంతాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసు కుందామా!!!!! "హంసల దీవి":- కృష్ణా నది ,సముద్రములో కలియు చోట ఉన్న పుణ్య క్షేత్రము. గంగా నది లో అనేక కలుషములు ఏర్పడ సాగెను. ప్రజల పాపములను స్వీకరిస్తూన్న ,"గంగా మాత ",పాప ప్రక్షాళనము చేసుకొనుటకై పక్షి రూపము ధరించెను . "గంగా దేవి " , కృష్ణాసాగర సంగమము ఉన్న సీమలో - కాకి రూపములోవచ్చి, స్నానము చేసేది. (గురుడు కన్యా రాశిలో ప్రవేశించే శుభ ఘడియలలో , వాయస రూపిణి ఐన గంగమ్మ ,ఓలలాడేది.) కాకి రూపంలో వచ్చిన ఆమె ," హంస"గా మారి పోయేది . అందు వలననే ,ఆ సీమకు "హంసల దీవి" అనే నామ ధేయము కలిగినది . 'శ్రీ వేణు గోపాల క్షేత్రము ' ,సంగమేశ్వర ఆలయము ' ఇచ్చట ఉన్నవి. శ్రీ విష్ణు మూర్తి , పరమేశుడు, ఒకేచోట కొలువై ఉండుట ,ఇక్కడి ప్రత్యేకత . హంసలదీవి , విజయ వాడకు 90 కీ మీ' దూరములో ఉన్నది . **************************...