పోస్ట్‌లు

పద క్రీడ - 1

చిత్రం
అధ్యాయి 1:- (తిరగ మోత – వర్గము):- వికటకవి, టమాట – ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా అవే అగుపిస్తున్నవి కదూ! ఇలాటివే మరి కొన్నిటిని చూడండి,  ఆనక మీరూ కొత్త అక్షర కూర్పులను చేయడానికి ప్రయత్నించండి. కొన్ని పదములకు చివరి ఒకటి లేదా రెండు అక్షరములను వదిలి చదివితే అవే మాట వచ్చేలా చేయడమే ఈ “పద క్రీడ”. భాష, మాటలు; ఇలాటివే మరి కొన్నిటిని చూడండి,  ఆనక మీరూ కొత్త అక్షర కూర్పులను చేయడానికి ప్రయత్నించండి. < కందకం >: < కంటకం >:  < హిమ గిరి కరిగి  మహి > ; < కర ద్వారక >: < గరిట తుంటరిగ >; < నవ పోతనా నాతపో – వన >; < లేఖ రేఖలే; > < నది అందిన >; < నవ పవన>   ; < మానవ పవనమా>; < జిగినీ గిజిగాడు >; < గడి – గుండిగ >:< కత – ముతక >: < మరి – సిరిమల్లి >: < నంద-నందనం >: < కూత – మేతకూడా >: < నాది -నందినా? >; < నాది – వదినా? >;:  < కరి హారిక >; ఇంగ్లీష్ లోనూ అట్లాంటివే కొన్ని…. < refer > : < level>: < flow – wolf > : < won – now > : ...

హల్లుల చెట్టు

చిత్రం
గంగరావి చెట్టు , ఈ పేరు పెట్టడానికి గొప్ప అభిప్రాయాలను చెప్పను. తెలుగులో "గంగ" అనే పేరుపట్ల కల ఆసక్తి, జిజ్ఞాసలు ఇట్లాంటి అచ్చ తెనుగు మాటలను మన తేనెలూరే భాషా కాంచన మంజూషాన పొందుపరిచినవి. గంగడోలు (గళ కంబళం, అని సంస్కృత పదము) గంగబోండాలు(కొబ్బరి బోండాలు), గంగోదకం, గంగమ్మ, గగన గంగ, ఆకాశ గంగ, గంగోత్రి, గంగాజలాదులు పట్టికలో అనేకం ఉన్నవి.  గంగరావి - అనే పేరుకి మూలమేమిటో తెలీకున్నా ఈ పేరును నా బ్లాగుకు పెట్టాను. నవ దవన అచ్చులు, హల్లులు  (అచ్చులు, హల్లుల చెట్టు ) Sunday, July 5, 2014 ; 3. 16 PM